Gutta Jwala – Vishnu Vishal : పెళ్లితో ఒకటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్..

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తన ప్రియుడు విష్ణు విశాల్‌తో ఏడడుగులు వేశారు. జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు. గురువారం (ఏప్రిల్ 22) చెన్నైలో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది..

Gutta Jwala – Vishnu Vishal : పెళ్లితో ఒకటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్..

Gutta Jwala – Vishnu Vishal

Updated On : April 23, 2021 / 1:19 PM IST

Gutta Jwala weds Vishnu Vishal: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తన ప్రియుడు విష్ణు విశాల్‌తో ఏడడుగులు వేశారు. జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు. గురువారం (ఏప్రిల్ 22) చెన్నైలో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది..

Gutta Jwala 1

2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని జ్వాల మ్యారేజ్ చేసుకున్నారు. పలు కారణాలతో 2011లో విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు.. విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కావడం, వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.. గతకొద్ది కాలంగా లవ్, డేటింగ్ వంటి వార్తల్లో నిలిచిన ఈ జంట పెళ్లి చేసుకోవడంతో క్రీడా, సినీ ప్రముఖులు వీరిద్దరికి విషెస్ చెబుతున్నారు.. జ్వాల, విష్ణు వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Gutta Jwala 2