వేలానికి హిట్లర్ టాయిలెట్ సీటు

వేలానికి హిట్లర్ టాయిలెట్ సీటు

Updated On : February 2, 2021 / 7:10 PM IST

Adolf Hitler రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ కూడా ఒకరు. యుద్ధం ముగిసే సమయంలో తనను కాల్చుకొని హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన గదిలో ఓ టాయిలెట్ ఉండేది. ఆ టాయిలెట్ సీట్ ను రాంగ్ వాల్డ్ సి బోర్చ్ అనే అమెరికన్ సైనికుడు దొంగిలించాడు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన సమయంలో సైనికుడు ఆ టాయిలెట్ సీట్ ను దొంగిలించాడు. ఆ తరువాత అక్కడి నుంచి దానిని న్యూయార్క్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆ సీట్ తన వద్దే ఉంచుకున్నారు. ఇప్ప‌టికే ఈ టాయిలెట్ సీటు వాళ్ల ఇంట్లోనే భ‌ద్రంగా ఉంది. ఇప్పుడా సైనికుడి కుటుంబ స‌భ్యులే దీనిని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుందామ‌ని భావిస్తున్నారు.

ఈ టాయిలెట్ సీట్ ను ఫిబ్ర‌వ‌రి 8న మేరీల్యాండ్‌లో వేలం వేస్తారు. వేలంలో ప్రారంభ ధారగా 5000 డాలర్లుగా నిర్ణయించారు. దాదాపుగా 15000 డాలర్లకు ఈ టాయిలెట్ సీట్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ టాయిలెట్ సీటుపై హిట్ల‌ర్‌కు సంబంధించిన ఓ న్యూస్ పేప‌ర్ క్లిప్పింగ్‌ను కూడా ఉంచ‌డం విశేషం.