మాస్క్ లు ధరిస్తున్నారా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: madhu ,Published On : June 11, 2020 / 06:30 AM IST
మాస్క్ లు ధరిస్తున్నారా..మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

Updated On : June 11, 2020 / 6:30 AM IST

ఎక్కడ చూసినా కరోనాపైనే చర్చ జరుగుతోంది. వైరస్ ను ఎలా ఎదుర్కొవచ్చు ? ఏమేమి పాటించాలి ? అనే దానిపై మాట్లాడుకుంటున్నారు. భారతదేశంలో వేల కేసుల నుంచి లక్షల వరకు పెరిగిపోతున్నాయి. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్ లో మాస్క్ లు విక్రయిస్తున్నారు. కానీ అన్ని మాస్క్ లు సేప్ కావని అంటున్నారు నిపుణులు. తుంపర్లు, ఇతర రూపాల్లో వైరస్ రాకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ లు ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. మాస్క్ లు ఉపయోగించడమే కాకుండా..చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చేయాలని వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి..WHO పలు సూచనలు చేసింది. 

నిత్యావసర సరుకులు విక్రయించే..దుకాణాలు, జనాలు ఎక్కువగా ఉన్న చోట నాన్ మెడికల్ మాస్క్ లు ధరిస్తే సరిపోతుందని వెల్లడించింది. బస్సులు, రైళ్లలో ప్రయాణించే వారు వేసుకోవచ్చని తెలిపింది. క్యాన్సర్, శ్వాస కోశ సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు మాత్రం తప్పనిసరిగా మెడికల్ మాస్క్ ధరించాల్సి ఉంటుందని సూచించింది.

భౌతిక దూరం పాటించడం సాధ్యం కాని చోట్ల, వైరస్ సోకే అవకాశాలున్న చోట్ల, 60 ఏళ్లకు పైబడిన వారు, గుండె జబ్బులు, డయాబెబిస్ వంటి ఇతర సమస్యలున్న వారు కూడా వీటిని ధరించాలని తెలిపింది. కరోనా లక్షణాల్లో ఏవైనా ఉన్నవారు, వ్యాప్తి నియంత్రణకు మెడికల్ మాస్క్ కంపల్సరీ అని సూచించింది. 

మాస్క్ లను ఉతికేందుకు వేడినీళ్లు ఉపయోగిస్తే బెటర్. అందుబాటులోని సందర్భంలో సబ్బు, డిటర్జెంట్ సోప్ తో వాటిని ఉతకొచ్చు. నాన్ మెడికల్ మాస్క్ లు తరచుగా ఉతకాల్సి ఉంటుంది. తడిసిన మాస్క్ లు అస్సలు ఉపయోగించవద్దు. 

మాస్క్ పెట్టుకొనే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నోరు, ముక్కు కవర్ అయ్యే విధంగా ఉండాలి. మాస్క్ ధరించిన తర్వాత పదే పదే తాకొద్దు. మాస్క్ లు విప్పిన వెంటనే శానిటైజర్ తో లేదా సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 

Read: ఒక్కరోజే 357 మరణాలు, 9996 కేసులు.. భారత్‌లో కరోనా ఉగ్రరూపం