Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

తెలుగు వారి ఓటీటీగా ప్రేక్షకులకు దగ్గరైన ఆహా.. భీమ్లా నాయక్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన రాయల్ ఎన్‌ఫిల్డ్..

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

Bheemla Nayak

Updated On : March 18, 2022 / 8:38 PM IST

Bheemla Nayak Bike: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మల్టీస్టారర్‌గా వచ్చిన భారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. పవన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. రెండు ఓటీటీ వేదికల్లో మార్చి 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Bheemla Nayak: వచ్చాడు భీమ్లా.. గ్రానైట్ బాంబ్‌లా.. రాప్‌సాంగ్ వచ్చేసింది

అయితే, తెలుగు వారి ఓటీటీగా ప్రేక్షకులకు దగ్గరైన ఆహా.. భీమ్లా నాయక్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన రాయల్ ఎన్‌ఫిల్డ్ రేర్ మోడల్ బైక్ గుర్తుందా.. సినిమాలో పవన్ ఎంతో స్టైలిష్‌గా వాడిన ఈ బైక్ చాలా సన్నివేశాలలో కనిపిస్తుంది. కాగా, ఇప్పుడు ఆ బైక్ ను ఆహాలో భీమ్లా నాయక్ చూసే ప్రేక్షకులు సొంతం చేసుకొనే ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తుంది. లక్కీ డ్రా ద్వారా ఆహా సబ్ స్క్రైబర్లలో ఒకరికి ఈ బైక్ అందించనున్నారట.

Bheemla Nayak: ఓటీటీలో భీమ్లా.. రికార్డులు ఆహా అనాల్సిందే!

మార్చి 24 అర్ధరాత్రి 12 గంటలకు భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అయిన అనంతరం ఆహా ఓటీటీని కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకొనే వారిని లక్కీ డ్రా తీసి ఒకరికి భీమ్లా నాయక్ లో పవన్ వాడిన బైక్ ను అందించనున్నట్లు సమాచారం. కాగా.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో ఆదివారం రోజున నిత్యా మీనన్, థమన్ ఈ లక్కీ డ్రాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండగా.. అదే షోకు ఆదివారం రానా దగ్గుబాటి కూడా హాజరు కానున్నారట.

Bheemla Nayak: పవన్‌కు బాకీపడ్డా లెక్కను సరిచేసిన త్రివిక్రమ్

ఇక, ఆహా నిర్వహించనున్న ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ కార్యక్రమానికి మరికొందరు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. భీమ్లా నాయక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా.. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆహా కొత్త సబ్ స్క్రైబర్ కు ఈ బైక్ అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ చేతుల మీదుగా పవన్ వాడిన ఆ లక్కీ విన్నర్ ఎవరు అవుతారో చూడాల్సి ఉండగా.. ఏమో మీరైనా కావచ్చు.. ఒకసారి ట్రై చేసి చూసుకోండి.