Akhanda Title Roar : ‘అఖండ’ ఆదరణ.. బాలయ్య భీభత్సం కొనసాగుతోంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ గా సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.. ఉగాది కానుకగా బాలయ్య-బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం టైటిల్‌తో ‘BB 3 టైటిల్ రోర్’ పేరుతో వీడియో విడుదల చేశారు..

Akhanda Title Roar Creating Sensation On Youtube
Akhanda Title Roar: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ గా సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.. ఉగాది కానుకగా బాలయ్య-బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం టైటిల్‌తో ‘BB 3 టైటిల్ రోర్’ పేరుతో వీడియో విడుదల చేశారు..
Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..
బాలయ్యను అఘోరాగా సరికొత్త గెటప్‌లో చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ‘అఖండ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘‘హర హర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’.. అంటూ బాలయ్య తన స్టైల్లో చెప్పిన డైలాగ్ ట్రెండ్ అవుతోంది.. పేల్చారు బాలయ్య.
ఇక వ్యూస్, లైక్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు.. రిలీజ్ చేసిన అప్పటినుండి ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ 41 మిలియన్లకు పైగా వ్యూస్, 4 లక్షలకు పైగా లైక్స్‌తో దూసుకెళ్తూ ‘అఖండ’ ఆదరణ సొంతం చేసుకుంది.. తెలుగు సినిమా చరిత్రలో ఈ రేంజ్ వ్యూస్ రాబట్టిన సీనియర్ హీరోగా బాలయ్య రికార్డ్ క్రియేట్ చేశారు..
Akhanda : సరైన మాస్ బొమ్మ పడితే బాక్సాఫీస్ బద్దలవుద్దీ.. ‘అఖండ’ గా సోషల్ మీడియాలో బాలయ్య అరాచకం..
ఇంతకముందు సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ 37.8 మిలియన్స్, ‘కాలా’ 33.8 మిలియన్స్, ‘రోబో’ 27 మిలియన్స్, ‘సైరా’ 22 మిలియన్స్ వ్యూస్ సాధించగా ‘అఖండ’ హైయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సీనియర్ హీరో టీజర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచింది. సరైన మాస్ బొమ్మ పడితే మా బాలయ్య స్టామినా ఇలానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు..
Thank you all for this Roaring Response??
With 40Million+ views #Akhanda title Roar setting @YouTubeIndia on ?
▶️ https://t.co/KYrviwj4dF#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @WhackedOutMedia pic.twitter.com/9BLrhdOqga
— Dwaraka Creations (@dwarakacreation) April 25, 2021