Akshay Kumar Crying : సోదరిని గుర్తుచేసుకొని షోలో ఏడ్చేసిన అక్షయ్ కుమార్..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ బాలీవుడ్ షో సూపర్‌స్టార్ సింగర్ రెండో సీజన్‌కి గెస్ట్ గా వెళ్ళాడు. రాఖి స్పెషల్ ఎపిసోడ్ కి అక్షయ్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ లో అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే పాటలు పాడారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో.........

Akshay Kumar cried remembering his sister in a TV show
Akshay Kumar Crying : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ త్వరలో రక్షాబంధన్ సినిమాతో రాబోతున్నాడు. సిస్టర్స్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతుంది. రాఖి సందర్భంగా ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అక్షయ్. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ బాలీవుడ్ షో సూపర్‌స్టార్ సింగర్ రెండో సీజన్‌కి గెస్ట్ గా వెళ్ళాడు.
NTR Tweet on Bimbisara : అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు ఆ క్యారెక్టర్.. బింబిసారపై ఎన్టీఆర్ ట్వీట్..
రాఖి స్పెషల్ ఎపిసోడ్ కి అక్షయ్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ లో అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే పాటలు పాడారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో అక్షయ్ తన సోదరితో కలిసి రాఖీ పండగ జరుపుకున్న ఫొటోలను, తన సోదరితో ఉన్న ఫోటోలని స్క్రీన్‌పై ప్లే చేశారు. అవి చూసి అక్షయ్ చాలా ఎమోషనల్ అయ్యారు. అక్షయ్ మాట్లాడుతూ నా సిస్టర్ దేవి వచ్చాక మా జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. మా బంధం అత్యంత విలువైనదని చెప్తూ ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగా ఇందులో అక్షయ్ కంటతడి పెట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.