Ghani: గని కోసం దిగుతున్న పుష్ప.. తగ్గేదే లే!

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో మరోసారి ....

Ghani: గని కోసం దిగుతున్న పుష్ప.. తగ్గేదే లే!

Allu Arjun As Chief Guest For Ghani Pre Release Event

Updated On : March 29, 2022 / 12:39 PM IST

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. ఇక పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో మనకు కనిపిస్తాడు.

Ghani: కొడ్తే.. అంటూ అందాలతో కొట్టిన తమన్నా!

అయితే ఈ సినిమాను గతంలోనే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈసారి ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 2న వైజాగ్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ప్రీరిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ ప్రీరిలీజ్ వేడుకపై ఇప్పుడు అందరి చూపులు పడ్డాయి. పుష్ప చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న బన్నీ, ఇలా మరో మెగా హీరో కోసం ముఖ్య అతిథిగా వస్తుండటంతో ఈ సినిమా గురించి ఆయన ఏం మాట్లాడుతాడా.. అలాగే తన పుష్ప 2 చిత్రానికి సంబంధించి బన్నీ ఏదైనా అప్‌డేట్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Ghani Movie: వరుణ్ యాక్షన్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టిలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రినైస్సెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.