తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 11:19 AM IST
తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే

Updated On : October 31, 2020 / 12:27 PM IST

తుపాకీ పట్టిన చర్చి ఫాదర్..ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే  శాంతి వచనాలు చెప్పే చర్చి ఫాదర్ చేతిలో గన్ పెట్టుకుని కనిపించారు. లోక రక్షకుడు..కరుణామయుడు బిడ్డ అయిన చర్చి ఫాదర్ చేతిలో గన్ కనిపించటం కాస్తంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదూ. చేతిలో గన్ ఉందని ఆ ఫాదర్ నక్సలైటూ కాదు  టెర్రరిస్టు అంతకంటే కాదు. ఎందుకో తెలిస్తే..హల్లెలూయా ఫాదర్ ను అపార్థం చేస్తుకున్నాం అంటూ నవ్వుకుంటాం..ఆ విశేషమేంటో చూద్దాం..

దూరం దూరం. ఇప్పుడు ప్రపంచమంతా అదే మంత్రం. కారణం. కరోనా. దూరం పాటించకపోతే కరోనా కాటేస్తుంది. కాబట్టి దూరం పాటించక తప్పదు. అదొక్కటే మందు అంటున్నారు శాస్త్రవేత్తలు సైతం. ఈ కరోనా కాలంలో చర్చి ఫాదర్ ఏసు విశ్వాసులపై పవిత్రజలం చిలకరించాలంటే వారి దగ్గరకు వెళ్లాల్సిందే.  అలా వెళ్లకుండా దూరం నుంచి పవిత్రజలం విశ్వాసులపై చల్లటానికి  తుపాకీ మంత్రాన్ని కనిపెట్టారు ఈ ఫాదర్. 

అమెరికాలోని డెట్రాయిట్ లో నీటిని పిచికారీ చేసే తుపాకీతో పవిత్ర జలాన్ని చిలకరిస్తున్న ఫాదర్ టిమ్ పెల్క్ అనే 70 ఏళ్ల  ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ట్విట్టర్ లో ఈ పొటో 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు  వచ్చాయి. ఓ డాక్టరుతో చర్చించిన తర్వాత ఈ తుపాకీ ఐడియా వచ్చిందని..దీనివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు అని డాక్టరుతో నిర్ధారించుకున్న తర్వాతనే అమలు చేసినట్లు చెప్పారు ఫాదర్ టిమ్ పెల్క్.

Read: పానీపూరి కోసం టీవీ ముందు నిలబడి అడుక్కుంటున్న బిగ్‌బాస్ భామ: ఏం పాట్లురా బాబూ..