Ananya Panday: ఆ స్టార్ హీరో తమ్ముడితో బాలీవుడ్ బ్యూటీ ప్రేమాయణం..?
బాలీవుడ్ భామ అనన్యా పాండే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’....

Ananya Panday Dating Ishaan Khattar
Ananya Panday: బాలీవుడ్ భామ అనన్యా పాండే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా తెలుగునాట అడుగుపెడుతోంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, అందుకు తగ్గట్టుగా ఈ మూవీని యూనివర్సల్ సబ్జెక్ట్‌తో రూపొందిస్తున్నారు. కిక్-బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే తనదైన అందాల ఆరబోతతో కుర్రకారుకు కిక్ ఇవ్వనుంది.
Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్
అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ స్టార్ హీరో తమ్ముడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా గతకొంత కాలంగా కోడై కూస్తోంది. హీరో షాహిద్ కపూర్ తమ్ముడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ ఖట్టర్, ‘ధడక్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో ‘ఖాలీపీలీ’ అనే సినిమాలో అనన్యా పాండేతో సన్నిహితంగా మెదిలాడు ఈ కుర్ర హీరో. ఆ సినిమా సమయంలోనే వీరి ప్రేమ చిగురించిందని బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి.
అటు ఇషాన్ ఖట్టర్ తల్లి, అలనాటి నటి నీలిమా అజీమ్ కూడా వీరి ప్రేమాయణం గురించి బహిరంగ కామెంట్స్ చేసింది. అనన్యా పాండే తమ కుటుంబంలోని మనిషని, తన కొడుకు ఇషాన్ ఖట్టర్‌కు ఆమె చాలా క్లోజ్‌గా ఉంటుందని, అతడికి ఎల్లవేళలా ఆమె తోడుండటం తమకు నచ్చిందని నీలిమా పేర్కొంది.
Vijay-Ananya: రౌడీ హీరో కాదు పిరికివాడు.. విజయ్‌పై అనన్య కామెంట్స్!
ఇక ఈ కామెంట్స్‌తో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఏ లెవెల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ కపుల్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది.. ఇషాన్‌తో తన బంధం పెళ్లి వరకు వెళ్తుందా.. అనే విషయాలపై అనన్యా ఎప్పుడు నోరువిప్పుతుందో చూడాలి.