AP CM YS Jagan : గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .

Ys Jagan Family Meet Governor Family
AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు . కొద్దిరోజుల క్రితం గవర్నర్ దంపతులకు కోవిడ్ సోకటంతో వారు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే.
Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 163 కోవిడ్ కేసులు
కోవిడ్ తదనంతర చికిత్సలు తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన గవర్నర్ దంపతులను సీఎం జగన్ దంపతులు కలిసి ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ కు ముఖ్యమంత్రి సూచించగా…..రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు.