Perni Nani: ఇది.. నీతిమాలిన పని కాదా..? టికెట్ రేట్లపై విమర్శిస్తున్న వారికి మంత్రి పేర్ని కౌంటర్
భీమ్లానాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై వస్తున్న విమర్శలకు.. ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని టఫ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలకు ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డారు.

Perni Nani
Perni Nani: భీమ్లానాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై వస్తున్న విమర్శలకు.. ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని టఫ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శలకు ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని విమర్శించారు. పవన్ సినిమాను.. జగన్ ప్రభుత్వం తొక్కేయాల్సిన అవసరం ఏముందన్నారు. పవన్ కల్యాణ్ గురించి ఇంతగా ఆవేదన చెందుతున్న చంద్రబాబు, లోకేశ్.. ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఒక్క మాటైనా మాట్లాడారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలపై.. టీడీపీ చేస్తున్న రాజకీయం.. నీతి మాలింది కాదా.. అని ప్రశ్నించారు.
Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ
టికెట్ ధరలపై.. టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని కామెంట్ చేశారు. ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు.. అందుకు అనుగుణంగా ధరలు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత లేదా.. అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలు.. పవన్ కల్యాణ్ గురించి.. తాము 2014లో కానీ.. 2019లో కానీ తాము పట్టించుకోలేదని.. ఇకపైనా పట్టించుకోవాల్సిన అవసరం కానీ.. సమయం కానీ లేదని పేర్ని నాని కామెంట్ చేశారు. చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు పవన్ కల్యాణ్ కు లేదని.. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని.. శ్రీరంగ నీతులు మాత్రం బాగా చెబుతారని.. పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
BheemlaNayak: వ్యక్తి కోసం వ్యవస్థను వదలట్లేదు.. భీమ్లా నాయక్‌పై చంద్రబాబు రియాక్షన్!
ఏనాడైనా.. ప్రభాస్ సినిమా గురించో.. మహేష్ బాబు సినిమా గురించో చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారా.. అని పేర్ని నాని ప్రశ్నించారు. వ్యవస్థలను దిగజార్చడంలో వారిని మించిన వారు లేరంటూ.. చంద్రబాబును ఉద్దేశించి కామెంట్లు చేశారు. బ్లాక్ లో టికెట్లు అమ్మాలంటూ డిమాండ్లు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. అఖండ సినిమా విషయంపైనా.. పేర్ని నాని మాట్లాడారు. జగన్ ను కలిసేది లేదంటూ బాలకృష్ణ కామెంట్ చేశారు కదా.. మీ స్పందన ఏంటి.. అని విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందించారు. బాలకృష్ణ అలా మాట్లాడి ఉంటారని తాను అనుకోవడం లేదని అన్నారు.
Nandamuri Bala Krishna: పిలిచారు.. కానీ, జగన్‌ని కలవను -బాలకృష్ణ
అసలు.. తనకు తెలిసినంతవరకూ బాలకృష్ణ అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదని.. ఏనాడైనా ప్రభుత్వం నుంచి అఖండ సినిమాకు కానీ.. బాలకృష్ణ సినిమాకు కానీ వేధింపులు ఎదురయ్యాయా చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. ఏనాడూ.. తన ప్రభుత్వం ఎవరినీ వేధించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. చేసినట్టు ఎక్కడైనా రుజువైతే క్షమాపణ చెప్పేందుకైనా సిద్ధమని పేర్ని నాని చెప్పారు. ఓవరాల్ గా.. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వానికి ఓ విధానం అంటూ ఉందన్న ఆయన.. చట్ట ప్రకారమే జగన్ ప్రభుత్వం నడుచుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఏర్పాటైన కమిటీ.. సోమవారం సమావేశం అవుతుందని.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని… ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచితే.. అధికారులు కచ్చితంగా అడ్డుకుని తీరతారని కుండబద్ధలు కొట్టారు.. పేర్ని నాని.
Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!
ఇప్పటికే.. సినిమా టికెట్ ధరల విషయంపై.. తెలుగు దేశం పార్టీ నాయకులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా.. బెనిఫిట్ షోలు వేయనివ్వకపోవడంపై.. టికెట్ ధరల కారణంగా మూత పడుతున్న థియేటర్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ.. పేర్ని నాని ఈ ప్రెస్ మీట్ తో తమ ప్రభుత్వ విధానం ఏంటన్నదీ తేల్చి చెప్పేశారు.