agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Secunderabad Railway Station (1)
agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తోన్న సమయంలో ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. దీంతో ఆయన గురించి అందరికీ తెలిసింది.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమో అని అజయ్ భయపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేయడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగి విధ్వంసానికి పాల్పడడంతో పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.