NBK 107: ‘బలరామయ్య బరిలో దిగితే’.. నయన్ ఫిక్స్..

NBK 107: ‘బలరామయ్య బరిలో దిగితే’.. నయన్ ఫిక్స్..

Updated On : December 16, 2020 / 7:24 PM IST

NBK 107: నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ BB 3 షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది. పూర్ణ, ప్రగ్య జైస్వాల్ కథానాయికలు.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య తన 107వ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్‌తో చేయనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే పవర్‌ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారు.

ఈ సినిమాలో బాలయ్య పక్కన ఇద్దరు కథానాయికలుంటారని, లేడి సూపర్ స్టార్ నయనతారను ఒక హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇంతకుముందు బాలయ్య, నయన్ నటించిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జైసింహా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. NBK 106, సంతోష్ శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు పూర్తవగానే NBK 107 పట్టాలెక్కనుంది.