అసలైన అభిమానం.. చిరు అభిమానికి బాలయ్య ఫ్యాన్స్ సాయం..

అసలైన అభిమానం.. చిరు అభిమానికి బాలయ్య ఫ్యాన్స్ సాయం..

Updated On : February 27, 2021 / 9:43 PM IST

Balakrishna Fans: మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఇద్దరు అగ్రహీరోల మధ్య బాక్సాఫీస్ వార్ బీభత్సంగా ఉండేది.. కలెక్షన్లు, రికార్డులు, 50, 100 డేస్ సెంటర్లు అని ఫ్యాన్స్ మధ్య నానా గొడవలు జరిగేవి.. తామిద్దరం మంచి స్నేహితులమని ఈ స్టార్స్ పలు సందర్భాల్లో చెప్పారు.

Chiranjeevi - Balakrishna

అలాంటి ఫ్యాన్ వార్‌లు జరిగే ఇరువురు హీరోలు మరో హీరో అభిమాని ఆపదలో ఉంటే మానవతా ధృక్పదంతో ఆదుకుని ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు సురేష్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య రూ. 20 వేల ఆర్థిక సాయమందిచారు. పలువురు బాలయ్య అభిమానులతో కలిసి హాస్పిటల్‌లో సురేష్‌ను పరామర్శించారు పీరయ్య.

Balakrishna Fans