Viral Video: బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ మా కుక్కను విమానంలోకి అనుమతించలేదు: బెంగళూరు వ్యక్తి

విమానంలోకి తమ పెంపుడు కుక్కను తీసుకెళ్లడానికి ఎయిర్ ఇండియా సిబ్బంది అనుమతించలేదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ కుక్కను బెంగళూరు విమానాశ్రయ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడం ఏంటని ఆ కుటుంబం నిలదీసింది. తాము అన్ని నిబంధనలనూ పాటించామని అయినప్పటికీ ఈ అనుభవం ఎదురైందని చెప్పింది.

Viral Video: బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ మా కుక్కను విమానంలోకి అనుమతించలేదు: బెంగళూరు వ్యక్తి

Viral Video

Updated On : December 18, 2022 / 1:09 PM IST

Viral Video: విమానంలోకి తమ పెంపుడు కుక్కను తీసుకెళ్లడానికి ఎయిర్ ఇండియా సిబ్బంది అనుమతించలేదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ కుక్కను బెంగళూరు విమానాశ్రయ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడం ఏంటని ఆ కుటుంబం నిలదీసింది. తాము అన్ని నిబంధనలనూ పాటించామని అయినప్పటికీ ఈ అనుభవం ఎదురైందని చెప్పింది.

సచిన్ షెనాయ్ అనే వ్యక్తి కుటుంబం బెంగళూరు నుంచి ఢిల్లీకి మళ్ళీ అక్కడి నుంచి అమృత్ సర్ వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాను, తన భార్య, కూతురు కలిసి 12 రోజుల పాటు సెలవుల్లో దేశంలోని పలు ప్రదేశాలను చూడాలనుకున్నామని, మూడు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నామని సచిన్ షెనాయ్ చెప్పారు.

తమ కుక్కను కూడా తమ వెంట తీసుకెళ్లడానికి అధికారులు, సిబ్బందితో మాట్లాడామని తెలిపారు. ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలనూ పూర్తి చేశామని చెప్పారు. ‘‘మా పెంపుడు కుక్క 4.2 కిలోల బరువు ఉంటుంది. నిబంధనల ప్రకారం మా కుక్క విమానంలో ప్రయాణించవచ్చు. అన్ని రకాల ప్రక్రియలనూ పూర్తి చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. అయినప్పటికీ ఇప్పుడు కుక్కను తీసుకురావద్దని చెప్పారు’’ అని అన్నారు. కుక్కను విడిచి తమనే విమానం ఎక్కాలని అన్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

India-Pakistan: అణు యుద్ధం చేస్తామంటూ భారత్‌కు పాకిస్థాన్ మంత్రి బెదిరింపు