గుడ్ న్యూస్ : ఆగస్టు 15న Bharat biotech company వ్యాక్సిన్ రెడీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తోంది.
ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ట్రయల్స్ రన్ కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఐసీఎంఆర్ (ICMR) తో కలిసి పని చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేశామని తెలిపింది. డీసీజీఐ అనుమతితో ట్రయల్స్ చేస్తున్నామని, కరోనానను నివారించగలిగితే..ఆగస్టు 15వ తేదీన వ్యాక్సిన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రీసెర్చ్ లో మునిగిపోయాయి. భారతదేశం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వ్యాక్సిన్ కనిపెట్టడంలో అన్ని దేశాల కంటే..ఇండియా పై చేయి సాధించే క్రమంలో దూసుకపోతోంది. భారతదేశ తొలి వ్యాక్సిన్ కు Drug controller and general of india (డీసీజీఐ) అనుమతి లభించింది. రీసెర్చ్ చేసిన కనుగొన్న వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగిస్తారని, ఈ ప్రయోగాల్లో 1, 2, 3 దశలుంటాయని తెలుస్తోంది. ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తే…ఇండియాకు మరింత ఖ్యాతి రావడం ఖాయంగా కనిపిస్తోంది.