BSP Satish Mishra : బీజేపీ..రాముడి పేరుతో ఓట్లు అడుగుతు.. సీతను మర్చిపోయింది : BSP నేత సెటైర్లు
బీజేపీ నేతలు రాముడి పేరుతో ఓట్లు అడుగుతు.. సీతను మర్చిపోయారని BSP సతీష్ చంద్ర మిశ్రా సెటైర్లు వేశారు.

Bjp Leaders Want Votes In Name Of Ram But Ignore Sita
BJP leaders want votes in name of Ram but ignore Sita: యూపీలో ఎన్నికల వేడి హీటెక్కిన క్రమంలో అన్ని పార్టీలు సభలు,సమావేశాలు..విమర్శలు ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోఅయోధ్య జిల్లాలోని మిల్కిపూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి సతీష్ మిశ్రా మాట్లాడుతూ..బీజేపీపై బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా సెటైర్లు వేశారు. ‘‘కాషాయ నేతలు ఓట్ల కోసం రాముడిని తెరపైకి తెస్తున్నారని..కానీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతు సీతను మర్చిపోయారు’’అని సెటైర్లు వేశారు. బీజేపీ సీతాదేవిని మర్చిపోయిందని బీజేపీపై బీఎస్పీ విమర్శలు గుప్పించారు.
Read more : Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా ? ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ
రాముడి పేరుతో బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు..కానీ సీతను మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. సీత లేనిదే రాముడు పరిపూర్ణుడు కాదు అనే విషయం అందరికి తెలుసని మరి రాముడికి ఓట్ల కోసం వాడుకుంటున్న బీజేపీ సీతను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. అంటే బీజేపీకి మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.సీతను బీజేపీ విస్మరించిన తీరు మహిళల పట్ల కాషాయ పార్టీ ఆలోచనా విధానాన్ని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. సీత లేనిదే రాముడు లేడు. అలాగే రాధ లేకుండా కృష్ణుడు లేడు..జగన్మాత పార్వతి లేకుండా శివుడు లేడు అని అన్నారు.
Read more : Israeli Archaeologists: రోమన్ కాలం నాటి నాణెలతో బయటపడ్డ పురాతన నౌక
బీజేపీ, ఎస్పీ యూపీలో ఘర్షణలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, ఎస్పీల హయాంలో యూపీలో దోపిడీ, మాఫియా, ఉగ్రమూకల స్వైరవిహారం, లైంగిక దాడులు, ఘర్షణలు సహజంగా మారాయని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్యలో 25 సీట్లను బీఎస్పీ గెలుచుకుని తీరుతుందని ఇది తథ్యం అని మిశ్రా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన తీరుతామని..తమ ప్రభుత్వం వచ్చాక అయోధ్య రామమందినికి సహకారం అందిస్తామని మిశ్రా ఈ సందర్భంగా అన్నారు.