BJP Workers: తిరంగా యాత్రలో తన్నుకున్న బీజేపీ వర్కర్లు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో బుధవారం తిరంగా యాత్ర జరుగుతుండగా పరస్పరం గొడవలకు దిగారు. మోతీలాల్ ఏరియాలో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్‌ను స్వాగతించేందుకు గానూ అక్కడికి చేరుకున్నారు. అలా యాత్ర జరగాల్సి ఉండగా.. రెండు వాహనాలు ఒకటికొకటి ఢీకొన్నాయి.

BJP Workers: తిరంగా యాత్రలో తన్నుకున్న బీజేపీ వర్కర్లు

Telangana Bjp

Updated On : August 11, 2022 / 7:52 AM IST

 

 

BJP Workers: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో బుధవారం తిరంగా యాత్ర జరుగుతుండగా పరస్పరం గొడవలకు దిగారు. మోతీలాల్ ఏరియాలో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్‌ను స్వాగతించేందుకు గానూ అక్కడికి చేరుకున్నారు. అలా యాత్ర జరగాల్సి ఉండగా.. రెండు వాహనాలు ఒకటికొకటి ఢీకొన్నాయి. ఇంకొన్ని నిమిషాల్లో డిప్యూటీ సీఎం అక్కడికి వస్తున్నాడని తెలియడంతో సీనియర్లు ఇన్వాల్వ్ అయి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

బీజేపీ కాన్పూర్ యూనిట్ చీఫ్ సునీల్ బజాజ్ దీనిని ఇలా అభివర్ణించారు. ” బైక్ యాక్సిడెంట్ అంశంలో పిల్లలు చిన్న గొడవపడ్డారు. వాళ్లు బీజేపీ వర్కర్లు. క్రమశిక్షణతో ఉంటారు. యాత్ర మొత్తం ప్రశాంతంగా సాగింది” అని పేర్కొన్నారు.

బీజేపీని ఎండగట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. కాషాయ పార్టీ తిరంగా యాత్రను ఆందోళన యాత్రగా మార్చొద్దని రిక్వెస్ట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.

Read Also: మహిళను తిట్టిపోసిన బీజేపీ లీడర్ అరెస్ట్