దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం

Dubbaka by-election
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పై 1,470 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 22 రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది.
మొత్తంగా బీజేపీకి 1470 ఓట్ల మెజారిటీ దక్కింది. గేమ్ ఛేంజర్‌గా మారిన చేగుంట తర్వాత.. నార్సింగ్ విజేతను నిర్ణయించింది. కాగా, సూరంపల్లి, పోతిరెడ్డి పేట, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి కౌంటింగ్ ఫలితాలు లెక్కించకుండా వదిలేశారు.
బీజేపీకి 62,772, టీఆర్ఎస్ కు 61,302, కాంగ్రెస్ 21,819 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంబురాల్లో పాల్గొన్నారు.