Blind Man Repair Vehicle: కంటిచూపు కోల్పోయినా.. వాహన రిపేర్‌లో దిట్ట.. క్యూకడుతున్న వాహనదారులు
హఫీజ్ తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేశాడు. 2003లో రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయాడు. అయినా, దురదృష్టం హఫీజ్‌ను వదిలిపెట్టలేదు. 2005లో దీపావళికి ఇంటిముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నును పోగొట్టుకున్నాడు. జీవితం అంధకారంగా మారింది..

Blind Man
Blind Man Repair Vehicle: కంటిచూపు లేదు.. ఆటోకు ఏ రిపేర్ వచ్చినా ఇంజిన్ శబ్ధాన్నివిని ఇట్టే పసిగట్టేస్తాడు. అంతేకాదు, చకచకా రిపేర్ కూడా చేసేస్తాడు. కళ్లు కనిపించవుకాదా.. ఎలా రిపేర్ చేస్తాడని అనుకుంటున్నారా? వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన హఫీజ్ చేయగలడు. ఒక్క ఆటోలనే కాదు ద్విచక్ర వాహనాలను రిపేర్ చేస్తున్నాడు. దీంతో వాహనదారులు అతని వద్ద తమ వాహనాలను ఎలాంటి సంకోచం లేకుండా రిపేర్ కు ఇస్తున్నారు.
Blind Old Man : కళ్లున్నవాళ్లైనా ఈయనలా చేయగలా?..చిప్స్ కొంటే మర్యాద ఇచ్చినట్లే
వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన హఫీజ్ తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రిషీయన్‌గా పనిచేశాడు. 2003లో రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయాడు. అయినా, దురదృష్టం హఫీజ్‌ను వదిలిపెట్టలేదు. 2005లో దీపావళికి ఇంటిముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నును పోగొట్టుకున్నాడు. జీవితం అంధకారంగా మారింది. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అయినా హఫీజ్ ఎక్కడా భయపడలేదు. అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటి చూపు కోల్పోయినా వెరవక తాను నేర్చిన పరిజ్ఙానంతో ఆటో మెకానిక్‌గా ముందుకుసాగుతున్నాడు.
Special shoe for blind: అంధుల కోసం ప్రత్యేక బూట్లు తయారు చేసిన 9th క్లాస్ విద్యార్ధి
స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు ఓపాత ఆటో కొనివ్వగా దాన్ని అద్దెకిస్తూ వచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. హఫీజ్.. వాహనం నుంచివచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గుర్తించి వెంటనే రిపేర్ చేసేస్తాడు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలనుసైతం రిపేర్ చేస్తున్నాడు. హఫీజ్ పనితనాన్ని గుర్తించిన వాహనదారులు ఆయన వద్దకు వచ్చి తమ వాహనాలను రిపేర్ చేయించుకొని వెళ్తున్నారు.