Vikram Gokhale: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
భారత సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గతకొద్ది రోజులుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.

Bollywood Actor Vikram Gokhale Passes Away At 77
Vikram Gokhale: భారత సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గతకొద్ది రోజులుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరగా, శనివారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు.
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ నటించిన పర్వానా(1971) సినిమాతో విక్రమ్ గోఖలే సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 40 ఏళ్ల పాటు ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. అయితే ఆయనకు గుర్తింపును తెచ్చిన సినిమాల్లో అగ్నిపత్(1990), హమ్ దిల్ దే చుకే సనమ్(1999), భూల్ భులయ్యా(2007), నటసామ్రాట్(2015), హిచ్కీ(2018), మిషన్ మంగళ్(2019) వంటి హిట్ సినిమాలు ఉన్నాయి.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి
మరాఠీలో ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన అనుమతి(2013) చిత్రానికి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. కాగా, గతకొద్ది రోజులుగా విక్రమ్ గోఖలే మృతిచెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా, వాటిని కుటుంబ సభ్యులు ఇటీవల ఖండించారు. అయితే ఇంతలోనే ఆయన మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. నటుడు విక్రమ్ గోఖలే మృతి పట్ల పలువురు సెలెబ్రిటీలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.