Top Headlines: అమ్ముడుపోమని కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందా.. రేపు రాహుల్‌, ఎల్లుండి అమిత్‌షా

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.

Top Headlines: అమ్ముడుపోమని కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందా.. రేపు రాహుల్‌, ఎల్లుండి అమిత్‌షా

Updated On : November 16, 2023 / 6:19 PM IST

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా..
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధు కావాలా లేదంటే రాబందు కావాలా అంటూ విపక్షాలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

తాము అమ్ముడుపోమని కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందా.??
కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కరీంగనర్ ఎంపీ, ప్రస్తుతం కరీంగనర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌తో కలిసే పనిచేస్తున్నారని బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రేపు రాహుల్‌.. ఎల్లుండి అమిత్‌షా బహిరంగ సభలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు. ఇక రాహుల్ గాంధీ సభలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 6 డిక్లరేషన్స్ ప్రకటించిన కాంగ్రెస్ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం అయింది. జనాకర్షక హామీలతో మ్యానిఫెస్టో సిద్ధం చేసింది హస్తం పార్టీ.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ.. తీర్పు రిజర్వు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వు చేశారు..

సీఎం జగన్ రివ్యూ
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష్ జరిపారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్‌ చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

రేపే పోలింగ్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు అలాగే చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు (రెండవ దశ) పోలింగ్ శుక్రవారం జరగనుంది. దీని కోసం ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా ఏర్పాట్లు చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు హోరా హోరీ ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంది. కాగా, ఎన్నికలను సామరస్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.