Viral Video: వరుడ్ని చూసిన ఆనందంలో వధువు డాన్స్!
పెళ్లంటే నూరేళ్ళ పంట.. ఇంతకి మించి గొప్పగా ఇంకేం చెప్పాలి పెళ్లి వేడుక గురించి. అలాంటి పెళ్లంటే ప్రతి యువతీ, యువకులలో కోటి ఆశలు.. బోలెడు ఆలోచనలు.

Viral Video
Viral Video: పెళ్లంటే నూరేళ్ళ పంట.. ఇంతకి మించి గొప్పగా ఇంకేం చెప్పాలి పెళ్లి వేడుక గురించి. అలాంటి పెళ్లంటే ప్రతి యువతీ, యువకులలో కోటి ఆశలు.. బోలెడు ఆలోచనలు. పెళ్లి వేడుకంటే తన జీవితంలో మర్చిపోలేనిదిగా ఉండాలని అందరూ ఆశపడతారు. పెద్దలు కూడా అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. అలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిన ఓ పెళ్లి మండపానికి వచ్చిన వధువు వరుడిని చూసి ఆనందం ఆపుకోలేకపోయింది. అందుకు తగ్గట్లే మండపంలో పాట కూడా తోడవటంతో ఆ పెళ్లి కూతురు స్టెప్పులేసింది.
ఈ మధ్యనే ఓ పెళ్లి కూతురు బరాత్ లో బుల్లెట్ బైక్ పాటకి డాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు అలాంటిది మరో వీడియో కూడా సోషల్ వైరల్ అవుతుంది. వధువు అందంగా, సంప్రదాయబద్దంగా ముస్తాబై పెళ్లి మండపం వద్దకు రాగానే వరుడు ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి సూపర్ హిట్ ఆల్బమ్ ‘ఉతి మొహబ్బత్ నే అంగడై లి’ పాట వచ్చింది.
దీంతో వరుడిని చూసిన ఆనందంలో వధువు స్టెప్పులేసింది. వధువు ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూసిన వరుడు కూడా ఆమెతో కలిసి కాలు కదిపాడు. మొత్తానికి ఆ పెళ్లి మండపం గల ప్రదేశమంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఫోటో షూట్ వెడ్డింగ్ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ వీడియోను 3 మిలియన్ల మందికి పైగా వీక్షించి, ఇరవై వేల మంది లైక్స్ కొట్టారు.
View this post on Instagram