Viral Video: తండ్రితో కలిసి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వైరల్!
ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకులలో వధూవరులు డాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బుల్లెట్ బండి పాటకి స్టెప్పులేసిన వధువు పాట

Viral Video (1)
Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకులలో వధూవరులు డాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బుల్లెట్ బండి పాటకి స్టెప్పులేసిన వధువు పాట ఈ మధ్యనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవగా.. అలాంటి మరికొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ వీడియోలన్నీ వధూవరులు డాన్స్ చేసిన వీడియోలు కాగా ఇప్పుడు వధువు తన తండ్రితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.
పెళ్లి సంగీత్‌లో పెళ్లికూతురు తన తండ్రితో కలిసి డ్యాన్స్ వేసింది. కూతురు ఆనందంతో స్టెప్పులేస్తుంటే తండ్రి మరింత ఉత్సాహంగా ఆమెతో కలిసి కాలు కదిపాడు. ఈ తండ్రి-తనయల డాన్స్ చూస్తూ పెళ్లికొచ్చిన అతిథులు ఫిదా అయ్యారు. తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కూతురును ఓ ఇంటిదాన్ని చేయాలని తండ్రి పడే తపన మామూలుగా ఉండదు.
ఈనేపథ్యంలో తండ్రీకూతురు ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయడం అది.. కూడా పెళ్లి కూతురు హుషారుగా నవ్వుతూ డ్యాన్స్ వేయడం ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను వెడ్‌గోఈజీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే.. ఆ వీడియో గత సంవత్సరం డిసెంబర్‌లో పోస్ట్ అయినప్పటికీ.. తాజాగా లైమ్‌లైట్‌లోకి వచ్చి సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram