CBI Raids: రాజస్థాన్ సీఎం గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ దాడులు.. మండిపడ్డ కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన్నారు. అందుకే మోదీ సర్కారు ఇలా అశోక్ గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

Agrasen Gehlot
CBI Raids: రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇంట్లో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే, అగ్రసేన్ గహ్లోత్‌కు సంబంధించిన ఓ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎరువుల ఎగుమతి కేసులో ఇప్పటికే అగ్రసేన్ గహ్లోత్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. 2007-2009 మధ్య ఎరువులను భారీ ఎత్తున అక్రమంగా ఎగుమతి చేశారని ఈడీ అంటోంది.
Enforcement Directorate: సత్యేందర్ జైన్ ఇళ్లు, కార్యాలయాల్లో మళ్లీ ఈడీ సోదాలు
ఎరువుల ఎగుమతికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఈడీ ఇప్పటికే పలుసార్లు ఆయనను విచారించింది. అశోక్ గహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గహ్లోత్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుపుతున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోన్న నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనలను అశోక్ గహ్లోత్ ముందుండి నడిపించారని ఆయన అన్నారు. అందుకే మోదీ సర్కారు ఇలా అశోక్ గహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలను తాము ఉపేక్షించబోమని చెప్పారు.