B.A. Raju : బి.ఏ. రాజు మరణం.. ప్రముఖుల సంతాపం..

బి.ఏ. రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి..

B.A. Raju : బి.ఏ. రాజు మరణం.. ప్రముఖుల సంతాపం..

B.a. Raju

Updated On : May 22, 2021 / 2:15 PM IST

B.A. Raju: ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి.ఏ. రాజు హైదరాబాద్ కేర్ హాస్పిటల్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు.

B.A. Raju : ఫిలిం జర్నలిస్ట్ బి.ఏ. రాజు సినీ ప్రస్థానం..

బి.ఏ. రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు..

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, తమిళ స్టార్ సూర్య, విశాల్, దుల్కర్ సల్మాన్, అఖిల్ అక్కినేని, కార్తికేయ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, అనూప్ రూబెన్స్, వక్కంతం వంశీ తదితరులు బి.ఏ. రాజుకి తమ సంతాపాన్ని తెలిపారు..