లవ్ బర్డ్స్.. లవ్లీ కపుల్స్..

లవ్ బర్డ్స్.. లవ్లీ కపుల్స్..

Updated On : February 16, 2021 / 2:34 PM IST

Valentines Day: 2021 ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమ పక్షులు ప్రేమగా సెలబ్రేట్ చేసుకున్నాయి. అలాగే సెలబ్రిటీలు వాలెంటైన్స్ డే ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. పెళ్లి అయిన వాళ్లు, ప్రేమలో ఉన్నవాళ్లు కూడా తమ పార్ట్‌నర్స్‌కి ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లవర్స్ డే నాడు చెర్రీ కార్ డ్రైవ్ చేస్తుండగా తమ పెట్‌తో ఉన్న పిక్ పోస్ట్ చేశారు ఉపాసన.

అక్కినేని యంగ్ కపుల్ సమంత, నాగ చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. చాలామంది తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలు ఇంకా కావాలని అడుగుతున్నారని, క్రిస్మస్‌కి పోస్ట్ చేస్తానని, బర్త్‌డేలు, యానివర్సరీ వంటి వాటికి అప్రూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ చైతుతో కలిసి ఉన్న క్యూట్ పిక్ షేర్ చేశారు సామ్.

లేడీ సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రెడిషనల్‌గా చీర కట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే.. సెలబ్రేట్ లవ్ ఎవిరీ డే.. వాలెంటైన్స్ డే విక్కీ నయన్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నయన్.

 

View this post on Instagram

 

A post shared by nayanthara? (@nayantharaaa)