chandrababu: వరద వస్తుందని హెచ్చరించినా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదు: చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ముంపు బాధితులను టీడీపీ ఆదుకుంటుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని, వరద వస్తుందని హెచ్చరించినా చలనం లేదని ఆయన అన్నారు.

Chandrababu
chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒకే ఒక్క బటన్ నొక్కి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్ ఓ బటన్ నొక్కి పోలవరం నిర్వాసితులకూ పరిహారం అందించాలని ఆయన అన్నారు. ఇవాళ ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అంటున్నారని ఆయన చెప్పారు. పోలవరం ముంపు బాధితులను టీడీపీ ఆదుకుంటుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని, వరద వస్తుందని హెచ్చరించినా చలనం లేదని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గిరిజనులకు కూడా ఎలాంటి సాయమూ చేయలేదని ఆయన చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం ఏపీ భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. కాగా, ఇవాళ ఉదయం భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతోనూ చంద్రబాబు నాయడు సమావేశమయ్యారు. ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక నేతలు చంద్రబాబు నాయుడికి చెప్పారు. సెప్టెంబరులో ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకావాలని చంద్రబాబు నాయుడిని ఇక్కడి నేతలు కోరారు. దీంతో తాను హాజరవుతానని చంద్రబాబు నాయుడు చెప్పారు.
bjp: అమరావతి కోసం మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారు: సోము వీర్రాజు