Lucknow: చాక్లెట్ల దొంగలు.. రూ. 17లక్షల విలువైన చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. సీసీ కెమెరాలను సైతం..

అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఏం చక్కా చాకెట్లు దొంగతనం చేశారు.

Lucknow: చాక్లెట్ల దొంగలు.. రూ. 17లక్షల విలువైన చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. సీసీ కెమెరాలను సైతం..

Chocolates

Updated On : August 17, 2022 / 12:01 PM IST

Lucknow: అందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఏం చక్కా చాకెట్లు దొంగతనం చేశారు. చాక్లెట్లు దొంతనం అంటే ఓ పెట్టె రెండు పెట్టెలు కాదు.. ఏకంగా రూ. 17లక్షల విలువైన వివిధ రకాల చాక్లెట్ల ప్యాకెట్లను దొంగలను దోచుకెళ్లారు. ప్రముఖ బ్రాండ్ క్యాడ్ బరీకి చెందిన దాదాపు 150 కార్టన్ ల చాక్లెట్ బార్ లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు దుకాణం యాజమాని తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని చిన్ హాట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Crude oil imports from Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులను మరోసారి సమర్థించిన కేంద్ర మంత్రి జైశంకర్

ట్రక్కులతో వచ్చి మరీ ఆ చోరీకి పాల్పడ్డారు. అయితే దొంగలు చోరీకి సంబంధించి ఎలాంటి సాక్షాదారాలు లేకుండా తమ పనిని కానిచ్చేశారు. గోడౌన్ లో ఉన్న సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్ ను కూడా ఎత్తుకెళ్లిపోవడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Coronavirus In India: ఢిల్లీలో మినహా దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..

చోరీ జరిగిని వాటిల్లో కొన్ని బిస్కెట్ల పెట్టెలు కూడా ఉన్నాయని సిద్ధు పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని వ్యాపారులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని, ఈ లోపు దొంగలు 17లక్షల విలువైన చాకెట్లను దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైన సమాచారం తెలిసుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే సీసీ కెమెరాలతో పాటు, ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా దొంగలు తమ పనిని పూర్తిచేయడంతో కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

https://twitter.com/ANINewsUP/status/1559759277249921024?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1559759277249921024%7Ctwgr%5E21bb4043c1eb1a8cace9077d0355569b45060642%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fcookery%2Fchocolates-worth-rs-17-lakh-stolen-cadbury-godown-1479043