Crude oil imports from Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులను మరోసారి సమర్థించిన కేంద్ర మంత్రి జైశంకర్

ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు కొనసాగిస్తుండడంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్ ప్రస్తుతం థాయిలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్ లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులకు భారత్ చేసుకన్న ఒప్పందాన్ని 'ఉత్తమ ఒప్పందం'గా ఆయన పేర్కొన్నారు.

Crude oil imports from Russia: ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులను మరోసారి సమర్థించిన కేంద్ర మంత్రి జైశంకర్

Crude oil imports from Russia: ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతులు కొనసాగిస్తుండడంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్ ప్రస్తుతం థాయిలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్ లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులకు భారత్ చేసుకన్న ఒప్పందాన్ని ‘ఉత్తమ ఒప్పందం’గా ఆయన పేర్కొన్నారు. భారత ప్రయోజనాల విషయంలో తాము నిజాయితీతో, ఎటువంటి దాపరికాలు లేకుండా నడుచుకుంటామని చెప్పారు. భారత తలసరి ఆదాయం రూ.1,58,675గా ఉందని, దీంతో దేశ ప్రజలు అధిక ఇంధన ఖర్చులను భరించలేరని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తమ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం తన నైతిక విధి అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన, గ్యాసు ధరలు భారీగా పెరిగిపోయాయని అన్నారు.

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి యూరప్ భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని తెలిపారు. రష్యా నుంచి భారత్ దిగుమతులు చేసుకుంటుండడంపై వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో అమెరికాకు తెలుసని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అభివృద్ధి చెందుతోన్న దేశాలపై ఏ మేరకు పడుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు. కాగా, రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ ను సమర్థిస్తూ ఈ ఏడాది జూన్ లోనూ జైశంకర్ మాట్లాడిన విషయం తెలిసిందే. రష్యా నుంచి క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడంపై భారత్ ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఆయన నిలదీశారు. ఉక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యా నుంచి యూరప్ దేశాలు కూడా గ్యాస్ ను దిగుమతి చేసుకుంటున్నాయి కదా? అని ప్రశ్నించారు.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ