Uma Maheshwari Funeral: మహాప్రస్థానంలో ముగిసిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు.. పాడె మోసిన బాలకృష్ణ..

ఇవాళ ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.............

Uma Maheshwari Funeral: మహాప్రస్థానంలో ముగిసిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు.. పాడె మోసిన బాలకృష్ణ..

Updated On : August 3, 2022 / 11:48 AM IST

Uma Maheshwari Funeral : సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉమామహేశ్వరి మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని షాక్ కి గురిచేసింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉమామహేశ్వరి ఇంటికి తరలి వెళ్లి ఆమెకి నివాళులు అర్పించారు.

Uma Maheshwari : విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం.. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య

ఇవాళ ఉదయం ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన సోదరి పాడె మోశారు. అంత్యక్రియలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు, లోకేష్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఉమామహేశ్వరి అంతిమయంత్ర జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటివద్ద నుంచి మహా ప్రస్థానం వరకు సాగింది. మహా ప్రస్థానంలో సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చింది.