Congress headquarters: పోలీసులపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.. ఎందుకంటే

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఏసీపీ, ఎస్‌హెచ్ఓను కలిసి ఫిర్యాదు చేశారు.

Congress headquarters: పోలీసులపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.. ఎందుకంటే

Congress Headquarters

Updated On : June 16, 2022 / 9:39 AM IST

Congress headquarters: ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ పార్టీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఏసీపీ, ఎస్‌హెచ్ఓను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ ఆఫీసులోకి అక్రమంగా చొరబడి, చట్ట వ్యతిరేకంగా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మూడు రోజులుగా నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

ఆందోళన తీవ్రతరం కావడంతో కార్యకర్తలు, నేతల్ని అడ్డుకునేందుకు పోలీసులు నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. రాహుల్ విచారణకు నిరసనగా, గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపట్టనున్నారు.