Agnipath: రేపు జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్న కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగనుంది.

Agnipath
Agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగనుంది. ఆందోళన చేస్తోన్న నిరుద్యోగ యువతకు సంఘీభావంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ సత్యాగ్రహ దీక్షకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఆలిండియా కమిటీ పదాధికారులు ఉదయం 10 గంటల నుంచి ఈ దీక్షలో కూర్చుంటారని తెలిపింది.
Agnipath: ఎల్లుండి నుంచి అన్ని సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం: సీపీఆర్వో రాకేశ్
దేశ వ్యాప్తంగా యువత నిరసన ప్రదర్శనలకు దిగిన నేపథ్యంలో తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. యువతకు మద్దతు తెలపడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. కాగా, జమ్మూకశ్మీర్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.