Coronavirus in India: దేశంలో కొత్తగా 1,082 మందికి కరోనా.. ఏడుగురి మృతి

దేశంలో కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,486కు చేరినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,46,59,447గా ఉందని చెప్పింది.

Coronavirus in India: దేశంలో కొత్తగా 1,082 మందికి కరోనా.. ఏడుగురి మృతి

india corona cases

Updated On : November 5, 2022 / 11:11 AM IST

Coronavirus in India: దేశంలో కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,486కు చేరినట్లు వివరించింది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,46,59,447గా ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 15,200 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. మొన్న ఈ సంఖ్య 15,705గా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతంగా ఉందని చెప్పింది.

కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,41,13,761గా ఉన్నట్లు తెలిపింది. దేశంలో వినియోగించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 219,71,46,012 గా ఉందని వివరించింది. నిన్న 1,67,659 కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. నిన్న దేశంలో 1,57,300 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..