PUNE : ఇంజినీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
పూనేలోని ఇంజనీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.

New Project
13 students at Pune Engineering College : మహారాష్ట్రలో కరోనా ఏమాత్రం తగ్గేదేలేదంటోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో పూణెలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 13మంది విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 25మంది విద్యార్ధులకు కరోనా లక్షణాలు కనిపించటంతో అప్రమత్తమైన యాజమాన్యం వారికి పరీక్షలు చేయించగా 13మందికి పాజిటివ్ గా తేలిందని ఆ సంస్థ సంస్థ అనుబంధంగా ఉన్న ఎమ్‌ఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ సోమవారం (డిసెంబర్ 27;2021) తెలిపారు. ఈ విద్యార్థులందరూ ప్రస్తుతం ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నారని తెలిపారు.
Read more : 19 students covid : జవహర్ నవోదయ స్కూల్లో కరోనా..19 మంది విద్యార్ధులకు పాజిటివ్
పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు..ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రశాంత్ డేవ్ చెప్పారు. కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నామని..దీంట్లో భాగంగానే విద్యార్థులను పరీక్షలు చేయించామని..స్క్రీనింగ్ సమయంలో, ఒక విద్యార్థికి కోవిడ్ లక్షణాలు కనిపించటంతో అతడిని కాలేజీలోకి రానివ్వకుండా ఇంటికి పింపించామని..దీతో అతని తల్లిదండ్రులను అతని ఆర్టీ పొందమని అడిగారు- పీసీఆర్ టెస్ట్ చేశాం” అని తెలిపారు. విద్యార్థి పరీక్షా రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత అతనితో కనెక్ట్ అయినవారికి కూడా పరీక్షలు నిర్వహించగా..ఇప్పటివరకు 13 మంది విద్యార్థులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
Read more : Medical Students Test Positive : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..66మంది మెడికల్ విద్యార్ధులకు కరోనా
మరో నలుగురు విద్యార్థుల రిపోర్టులు రావాల్సి ఉందని..కరోనా సోకిన విద్యార్థులందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. సదరు విద్యార్ధుల కుటుంబాలతో టచ్ లో ఉన్నామని వారి ఆరోగ్యం గురించి నిశితంగా గమనిస్తున్నామనీ వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరైన 25 మంది విద్యార్థులకు పూర్తిగా టీకాలు వేయించుకున్నారని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, ఈ నిర్దిష్ట బ్యాచ్ యొక్క ఆఫ్‌లైన్ తరగతులను ఆన్‌లైన్ మోడ్‌కు మార్చామని తెలిపారు.