Tollywood Drugs : దుబాయ్ దావత్ లో ఏం జరిగింది? : కెల్విన్ సమక్షంలో రానా ఇంటరాగేషన్

దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.

Tollywood Drugs : దుబాయ్ దావత్ లో ఏం జరిగింది? : కెల్విన్ సమక్షంలో రానా ఇంటరాగేషన్

Rana Kelvin

Updated On : September 8, 2021 / 2:15 PM IST

Tollywood Drugs Rana : టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం, మనీలాండరింగ్ వ్యవహారం రోజురోజుకూ హీట్ పెంచుతోంది. సినీ తారలు, Drugs డీలర్లకు మధ్య వ్యాపార లావాదేవీలపై కూపీ లాగుతున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తుతో బయటపడ్డ వాస్తవాలతో… తీగ లాగితే డొంకే కదులుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ డ్రగ్ వ్యవహారం చప్పున చల్లారినట్టు మూడేళ్ల కిందట అనిపించినా… డ్రగ్స్ లింకుల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారికంగా సమాచారం అందుతోంది.

Read This :  Tollywood Drugs : ఈడీ ఎదుట నటుడు నందు, ముందుగానే హాజరు!

సినీ స్టార్ల విచారణలో భాగంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా(Daggubati Rana) ఇవాళ (సెప్టెంబర్ 8,2021) ఈడీ ఆఫీస్ లో ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. సినిమా నటీనటులకు, ఇతర ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో రానాను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న కెల్విన్ ఇంటి నుంచి.. ఈడీ ఆఫీస్ కు అతన్ని తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నటుడు నిన్న హాజరైన సందర్భంగానూ.. కెల్విన్ ను విచారణకు పిలిచారు. ఇవాళ కూడా…. కెల్విన్ సమక్షంలోనే రానాను డ్రగ్ లింకులపై ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ ఇప్పటికే పోలీసులకు అప్రూవర్ గా మారినట్టు సమాచారం. అతడిచ్చిన సమాచారంతోనే… రానానుంచి వివరాలు రాబడుతున్నారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.

Read This : Tollywood Drugs Case : సినీ తారల సీక్రెట్స్ చెప్పేసిన కెల్విన్.. ఇక స్టార్స్‌కు చిక్కులే..

రానా ను ముగ్గురు సభ్యుల ఈడీ బృందం ప్రశ్నిస్తోంది. ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో రానా ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. 2015-17 లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను రానా ఈడీకి సమర్పించారు. రెండు బ్యాంకు అకౌంట్లకు సంబంధించి సమాచారాన్ని రానా ఇచ్చినట్టు తెలుస్తోంది. రానా బ్యాంకు అకౌంట్లు, జరిగిన లావాదేవీలను పరిశీలిస్తోంది ఈడీ బృందం. రానా అకౌంట్ నుంచి కొన్ని అనుమానిత ఆర్థిక లావాదేవీలు జరిగాయని… వాటి విషయంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులకు ఈ రెండు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బులు వెళ్లాయని ఈడీ భావిస్తోంది. దుబాయ్ లో జరిగిన ఈవెంట్లలో రానా, కెల్విన్ మధ్య నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.

నిన్న మంగళవారం రాత్రి వరకు కెల్విన్, నందులను ప్రశ్నించారు అధికారులు. అరెస్ట్ చేస్తారని సమాచారం వచ్చినప్పటికీ.. మరింత క్లారిటీ కోసం మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి పంపించేశారు. నటుడు నందు గేట్ దూకి మీడియా కంటపడకుండా తన ఇంటికి వెళ్లిపోయారు.