Marburg Virus : పశ్చిమ ఆఫ్రికాలో ప్రాణాంతక వైరస్… మార్ బర్గ్ వైరస్ తో ఒకరు మృతి

మార్ బర్గ్ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. వ్యాధి నిరోధానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి టీకాలను కనుగొనలేదు.

Marburg Virus : పశ్చిమ ఆఫ్రికాలో ప్రాణాంతక వైరస్… మార్ బర్గ్ వైరస్ తో ఒకరు మృతి

Gabbilam (1)

Updated On : August 10, 2021 / 5:57 PM IST

Marburg Virus : కరోనాతోనే ప్రపంచ దేశాలు వణికిపోతుంటే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ తరహాలోనే ఈ వైరస్ ప్రాణాంతమైందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించింది. ఆఫ్రికా దేశం గినియాలో మార్ బర్గ్ వ్యాధి కేసు నమోదైంది. గుడిడెవో రాష్ట్రంలో చనిపోయిన ఓ రోగి నుండి శ్యాంపిల్స్ పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.

జంతువులనుండి ఈ వైరస్ మనుషులకు సోకి ఉంటుందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఈ వైరస్ విస్తరిస్తే మరణాల శాతం 88గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఇదే తరహా కేసులు దక్షిణ కొరియా , అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో నమోదయ్యాయి. వెస్ట్ ఆఫ్రికాలో నమోకావటం ఇదే తొలిసారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మార్ బర్గ్ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. వ్యాధి నిరోధానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి టీకాలను కనుగొనలేదు. గతంలో ఈ వ్యాధి ప్రబలిన సందర్భంలో మరణాల రేటు 24 నుండి 88శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే మార్ బర్గ్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం లేవని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

కొండ గుహలు, పురాతనమైన భవనాలు వంటి ప్రదేశాలు గబ్బిలాలకు అవాసాలు. అలాంటి ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో గబ్బిలాల నుండి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సియ్రా లియోన్, లిబేరియా బోర్డర్ వద్ద ఉన్న గ్రామంలో మార్ బర్గ్ కేసు నమోదైంది. రోగికి తొలుత మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 2 అతను చనిపోయిన తరువాత పోస్టుమార్టమ్ పరీక్షల్లో ఎబోలా నెగటివ్, మార్ బర్గ్ పాజిటివ్ గా గుర్తించారు.