చిట్టి చేతుల్లో చైతన్యం : రైతన్నల ఆందోళనలకు ఏడాది చిన్నారి మద్దతు

Delhi farmer protest one year small child sartaj got famous among protesters : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పలు రాష్ట్రాలకు చెందిన రైతులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిగాలుల్ని కూడా లెక్క చేయకుండా నడిరోడ్లమీదనే పడుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు.వీరికి పలు వర్గాల నుంచి సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. విదేశాల నుంచి కూడా మద్ధతు లభిస్తుండటం మరో విశేషం. ఈ క్రమంలో కేవలం ‘ఏడాది వయస్సున్న చిన్నారి’ కూడా తన చిట్టి చేతులతో రైతన్నలకు మద్దతు తెలపటం రైతుల ఆందోళనా కార్యక్రమంలో ఆకట్టుకుంటోంది.
గత రెండు రోజు రోజులుగా ఈ ఆందోళనల్లో ఏడాది బాలుడు పాల్గొంటున్నాడు. ఇంత చిన్నవయసులో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న ఆ బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన చిన్నారి చిట్టి చేతులతో సర్తాజ్ అనే ఏడాది వయస్సున్న చిన్నారి రైతులకు మద్దతు తెలియజేయటం పెద్ద విశేషంగా మారింది. ఆందోళనలో పొల్గొంటున్నావారు సైతం ఈ చిన్నారి సర్తాజ్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. నీలాంటి భావి భారత పౌరుల కోసమే మా ఆందోళనలురా బుజ్జీ అంటూ సర్తాజ్ ని అభినందిస్తున్నారు రైతన్నలు. ఏడాది వయస్సు సర్తాజ్ ఫోటోలు వైరల్‌గా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆ ముద్దులొలికే బాలుడు ధరించిన టీ షర్టుపై ‘రైతుల భూములు లాక్కోవద్దు’ అనే నినాదం రాసి ఉంది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, చిన్నారి సర్తాజ్ వారికి మద్దతు పలుకుతూ తన చిన్ని చేతులను పైకి ఎత్తుతున్నాడు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన సర్తాజ్ తండ్రి డాక్టర్ రవదీప్ సింగ్ సంథూ రైతులకు తమ మద్ధతు తెలిపేందుకు తన చిన్నారి సర్తాజ్ ను కూడా తీసుకొచ్చారు. తన కొడుకు కూడా రైతన్నలకు మద్దతు తెలుపుతున్నాడండూ సర్తాజ్ చేతుల్ని పైకెత్తి నినాదాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా రవదీప్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఒక రైతు కొడుకుని..నా తండ్రి వ్యవసాయం చేస్తూనే తనను చదివించాడు..రెండు రోజుల క్రితం నా కుమారునితోపాటు రైతులకు మద్దతు పలికేందుకు నా భార్యా, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చాను..నా కొడుకు కూడా రైతులకు మద్దతు తెలుపుతున్నాడని చెప్పారు.
ఈ సందర్భాగా చిన్నారి సర్తాజ్ తల్లి..డాక్టర్ నవదీప్ కౌర్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ బిల్లులను వెనక్కి తీసుకోకపోతే మోదీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.