Delhi : ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా..ఆరుగురు అరెస్ట్
భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ముస్తాబైంది. ఈ వేడుకల వేళ ఉగ్రకుట్రలు జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంట్లో భాగంగానే కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Over 2,000 Cartridges Found .. six arrested..
Delhi : భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ముస్తాబైంది. ఈ వేడుకల వేళ ఉగ్రకుట్రలు జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేసింది. నిరంతరం డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. దీంట్లో భాగంగానే భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనంద్ విహార్‌లో అరెస్టు చేసిన వారి నుంచి 2,251 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 15 వేడుకల దేశవ్యాప్తంగా అంగరంగవైభోగంగా జరుగనున్న సమయంలో ఢిల్లీలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. తనిఖీల సమయంలో అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ సందర్బంగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రంజిత్ సింగ్ మాట్లాడుతూ.. ఆ ఆరుగురు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు తూటాలను తరలించేందుకు ప్లాన్ చేశారని వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేసి తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కుట్రలో ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నామని నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. ఆరుగురిలో ఒకరు డెహ్రాడూన్‌కు చెందిన వ్యక్తి అని, అతను గన్
హౌజ్‌కు ఓనర్ అని తెలిపారు.
కాగా భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకోనుంది. ఇటువంటి సమయంలో ఢిల్లీలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు మార్కెట్ల వద్ద పోలీసులు డేగ కళ్లతో కావాలికాస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లను నిరంతరాయంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో 10 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. రెడ్‌ఫోర్టుకు వచ్చే దారులపై నిఘా పెట్టి, బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవ్వరు కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.