Jagame Tandiram : భారీ ధరకు ధనుష్ సినిమా.. ఎన్ని కోట్లో తెలుసా..?
అందరి సినిమాలూ ఒక దారి అయితే ధనుష్ సినిమాలది మరో దారి.. కమర్షియల్ కంటెంట్ జోలికి పెద్దగా వెళ్లని ధనుష్ సినిమాలను మాత్రం ఓటీటీలు కోట్లకు కోట్లు రేట్ పెట్టి కొనేస్తున్నాయి..

Dhanush Jagame Tandiram Creates New Record On Ott
Jagame Tandiram: ధనుష్.. ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గానే చేస్తాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ.. సూపర్ సక్సెస్ సాధిస్తున్నాడు. అందుకే అది ఓటీటీ అయినా, థియేటర్ అయినా ఆయన సినిమాల రేంజ్, రేట్ ఒకేలా ఉంటుంది. లేటెస్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ధనుష్ సినిమాని ఏకంగా 50 కోట్లకన్నాఎక్కువే పెట్టి సొంతం చేసుకుంది ఓటీటీ.
థియేటర్లు లేవు, ఓపెన్ చేసినా జనాలు వచ్చే పరిస్థితి లేదు.. అందుకే ఇంకా ఎక్కువ నష్టపోవడం ఎందుకని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు ఏదో గుడ్డిలో మెల్లలా.. సినిమాని వచ్చిన రేట్‌కే ఓటీటీకి సేల్ చేసేస్తున్నారు. అందరి సినిమాలూ ఒక దారి అయితే ధనుష్ సినిమాలది మరో దారి. కమర్షియల్ కంటెంట్ జోలికి పెద్దగా వెళ్లని ధనుష్ సినిమాలకు మాత్రం ఓటీటీలు కోట్లకు కోట్లు రేట్ పెట్టి కొనేస్తున్నారు.
ధనుష్ ‘అసురన్’, ‘కర్ణన్’ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.ఈ సినిమాలు హిట్ అవ్వడంతో కరోనా క్రైసిస్‌లో కూడా ధనుష్ అప్‌కమింగ్ మూవీ ‘జగమేతంత్రం’ కు డిమాండ్ ఫుల్‌గా ఉంది. అందుకే ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఏకంగా 60 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందన్న టాక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
ఓటీటీలో 60 కోట్లు పెట్టి కొనడమే కాకుండా, ఈ సినిమాని ఏకంగా 17 భాషల్లో రిలీజ్ చేస్తోంది ఓటీటీ. అంతేకాదు ఇండియన్ హిస్టరీలో హయ్యస్ట్ వ్యూస్ ఈ సినిమాకే వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రిలీజ్ కాబోతున్న ‘జగమేతంత్రం’ సినిమా తమిళ్ ఓటీటీ హిస్టరీలోనే హయ్యస్ట్ సేలబుల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.