Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు
ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

uttarakhand earthquake
Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. తెహ్రీకి 78 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake In Arunachal Pradesh : అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదు
గత నెలలో ఉత్తరాఖండ్‌లో రెండు సార్లు భూకంపం సంభవించింది. అక్టోబర్ 8న 3.9 తీవ్రతతో మున్సియారీలో భూమి కంపించింది. అక్టోబర్ 2న 2.5 తీవ్రతతో ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు సంభవించాయి.