Eatala Rajender: నిజాము, బ్రిటిష్ వారూ ఇలా వ్యవహరించకుండొచ్చు: ఈట‌ల‌

హక్కు పత్రాలు ఇస్తాన‌ని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో కూడా చెప్పార‌ని ఈట‌ల‌ గుర్తు చేశారు. పోరాటం చేస్తున్న వారిని కర్కశంగా అరెస్టు చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

Eatala Rajender: నిజాము, బ్రిటిష్ వారూ ఇలా వ్యవహరించకుండొచ్చు: ఈట‌ల‌

Etela

Updated On : July 9, 2022 / 2:27 PM IST

Eatala Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు అమ్ముకునే బ్రోకర్‌గా తయారు అయ్యారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గిరిజ‌నుల‌కు అత్యున్నత గౌరవం ఇవ్వాలని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌప‌ది ముర్ముకు అవకాశం కల్పించింద‌ని ఆయ‌న చెప్పారు. గతంలో గిరిజనులు సాగు చేసుకునే భూములకు హక్కు పట్టాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. లక్షలాది ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చిందని వివ‌రించారు. హక్కు పత్రాలు ఇస్తాన‌ని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో కూడా చెప్పార‌ని ఈట‌ల‌ గుర్తు చేశారు. పోరాటం చేస్తున్న వారిని కర్కశంగా అరెస్టు చేస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో క‌ల‌క‌లం.. ఇంటి నుంచి అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ప‌రారీ

మహిళలు, చిన్న పిల్లలను కూడా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఈటల ఆరోపించారు. నిజాము, బ్రిటిష్ వారు కూడా ఇలా వ్యవహరించకుండొచ్చు అని అన్నారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగానైనా గిరిజ‌నుల‌ సమస్యల‌ను కేసీఆర్ పరిష్కరించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తాము పరిష్కరించడానికి కృషి చేస్తామ‌ని అన్నారు. అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ చెప్పార‌ని, ఎనిమిదేళ్ళ‌లో ఒక్క ఎకరా అసైన్డ్ భూమి కూడా ఇవ్వలేదని అన్నారు. మూడు ఎకరాల భూ పంపిణీని సైతం చేయలేదని తెలిపారు. నగరం చుట్టూ ఉన్న లక్షల ఎకరాలపై కేసీఆర్ కన్నుపడిందని ఆయ‌న ఆరోపించారు. ప్రభుత్వం అవసరాలకు కాకుండా ప్రైవేటు వారికి ఈ భూములు లాక్కుని పెద్దలకు కట్టబెడుతోంద‌ని అన్నారు.

MLA Raja Singh : అమర్నాథ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కొన్ని సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూములను గుంజుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో భయపెట్టి పేదల నుంచి కేసీఆర్ భూములు లాక్కుంటున్నార‌ని ఈటల అన్నారు. రైతుల వద్ద రూ.10 లక్షలకు కొని ఫార్మాసిటీలో వ్యాపారులకు కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను కాపాడేందుకు బీజేపీ పేదలకు అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. దళిత సంఘాలు కూడా ఈ విష‌యంపై దృష్టి పెట్టాల‌ని అన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న భూములను కూడా అన్యాయంగా కేసీఆర్ లాగేసుకుంటున్నార‌ని చెప్పారు.

vijaya sai reddy: షర్మిలమ్మ పార్టీ కోసం విజయమ్మ వెళ్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

పేదల జోలికి వేస్తే కేసీఆర్ మాడి మసైపోతారని ఆయ‌న హెచ్చ‌రించారు. భూ ప్రక్షాళన బాగా చేశారని ఒక నెల జీతం అదనంగా ఇచ్చిన కేసీఆర్.. నేడు ఆ వీఆర్వోల ఉద్యోగాలను తీసేసి వారిని రోడ్డుకీడ్చార‌ని ఆయ‌న అన్నారు. భూ సమస్యలు అక్కడికక్కడే సభలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. భూముల‌ డిజిటలైజేషన్ అని, చిటికేస్తే పనైపోతదని కేసీఆర్ అన్నారని ఈట‌ల చెప్పారు. ఇప్పటి వరకు అతీగతీ లేదని విమ‌ర్శించారు. భూములు అమ్ముకుని లక్షల కోట్ల డబ్బు పోగు చేసుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నార‌ని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ ఎన్నో కోట్ల రూపాయ‌లు ఖర్చు చేసినా ప్రజలు ఓడించారని ఆయ‌న అన్నారు.