Elderly Man Stunts on Bicycle : సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా.. వారెవ్వా ఏం జోరు..!!

సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా అనిపిస్తున్నాయి ఈయనగారి ఫీట్లు చూస్తుంటే..పైగా తడిచిన రోడ్డుమీద మాంచి జోరుగా సైకిల్ తొక్కేస్తూ ఫీట్స్ కూడా చేసేస్తున్నాడు.

Elderly Man Stunts on Bicycle : సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా.. వారెవ్వా ఏం జోరు..!!

Elderly man performs stunts on his bicycle

Updated On : July 13, 2023 / 11:52 AM IST

Elderly man performs stunts on his bicycle : ఈరోజుల్లో సైకిల్ తొక్కు రోడ్డుమీద కనిపించటం చాలా తక్కువైపోయింది. అలా ఎవరైనా కనిపిస్తే చిన్నప్పుడు సైకిల్ తొక్కుతు చేసిన రకరకాల ఫీట్లు గుర్తుకొస్తుంటాయి. ఇదిగో ఈ పెద్దాయనను చూస్తే కచ్చితంగా గుర్తుకొస్తాయి ఆరోజులు..ఓ పెద్దాయన సైకిల్ తొక్కుతూ చేసిన ఫీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పైగా వర్షం పడిందేమో..రోడ్డు కూడా తడిగా ఉంది. అయినా ఆ పెద్దాయన మాత్రం ఏదో నవ యువకుడిలా జోరుగా సైకిల్ తొక్కేస్తే మధ్య మధ్యలో ఫీట్లు చేస్తున్నాడు. ఉత్సాహం ఉండాలేగానీ వయస్సు ఏమాత్రం అడ్డురాదని నిరూపిస్తున్నాడు.

కొంద‌రు వ‌య‌సు మీద‌ప‌డినా ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో స‌త్తా చాటటం చూస్తుంటాం. శారీర‌క‌, మాన‌సిక సామ‌ర్ధ్యం త‌మ‌లో ఏమాత్రం స‌డ‌ల‌లేద‌ని వ‌య‌సు కేవ‌లం ఓ సంఖ్య మాత్ర‌మేనంటారు. ఇదిగోండీ ఈ పెద్దాయన ఉత్సాహం చూస్తే అదే అనిపిస్తుంది. ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ చేసిన విన్యాసాలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ట్విట్ట‌ర్‌లో ఈ వీడియో షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 50000కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఈ వీడియోలో వృద్ధుడు సైకిల్‌పై వెళుతూ ఫీట్లు చేస్తున్నాడు. ఈ ఫీట్స్ కు నెటిజ‌న్ల‌ ఫిదా అయిపోతున్నారు. ఏంటి పెద్దాయన కాస్త జాగ్రత్త అంటూ సూచనలిస్తున్నారు అదే రోడ్డులో ప్ర‌యాణిస్తున్న ఒక‌రు ఈ వీడియోను రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. జీవితం అంద‌మైన‌ద‌ని ఓ యూజ‌ర్ అంటుంటే.. మ‌రొక‌రు జీవితంలో ఆనందం ఇదేన‌ంటున్నారు. ఏది ఏమైనా సైకిల్ తొక్కుతుంటే ఈ జోషే వేరుగా ఉంటుంది కదూ అనిపిస్తోంది ఈ పెద్దాయనను చూస్తుంటే..మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ వీడియోపై..మీకు కూడా కచ్చితంగా గుర్తుకొస్తాయి స్వీట్ మెమరీస్..