Gujarat: గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యం.. 850 మంది ప‌దాధికారులను నియ‌మించిన ఆప్

Gujarat: గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యం.. 850 మంది ప‌దాధికారులను నియ‌మించిన ఆప్

Aap Will Leave Politics If Bjp Gets Mcd Polls Held On Time And Wins It

Updated On : June 12, 2022 / 4:29 PM IST

Gujarat: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబ‌రులో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ మేర‌కు 850 మంది ప‌దాధికారుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. అలాగే, గుజ‌రాత్‌కు చెందిన ఇసుదాన్ గాధ్వీని జాతీయ సంయుక్త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఇంద్రానిల్ రాజ్‌గురును జాతీయ సంయుక్త కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది.

prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

కాగా, పార్టీ సంస్థాగత పున‌ర్నిర్మాణం పేరిట ఈ నిర్ణ‌యాలు తీసుకుంది. రాష్ట్ర‌, జిల్లా, తాలూల స్థాయిల్లోని పాత క‌మిటీల‌ను ర‌ద్దు చేసింది. త‌మ త‌దుప‌రి ల‌క్ష్యంగా గుజ‌రాత్‌లో విజ‌యం సాధించ‌డ‌మేన‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు చెబుతున్నారు. గుజ‌రాత్‌లోని మ‌హేసానా జిల్లాలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ ఈ నెల 7న రోడ్ షో కూడా నిర్వ‌హించారు.