‘F3’- నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వస్తోంది..

  • Published By: sekhar ,Published On : December 13, 2020 / 04:02 PM IST
‘F3’- నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వస్తోంది..

Updated On : December 13, 2020 / 4:55 PM IST

F3 – More Fun Begins Soon: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’.. గతేడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది.

F 3

ఇప్పుడు మోర్‌ ఫన్‌తో.. అదే టీమ్‌తో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్‌ 3’ రూపొందనుంది. వెంకీ పుట్టినరోజు సందర్భంగా.. అధికారిక ప్రకటన వెలువడింది. ‘నవ్వుల వ్యాక్సిన్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం’.. అని వెంకీ వాయిస్‌ ఓవర్ ఇచ్చారు..

F 3

‘నవ్వుకోవడాకి మీరు కూడా థియేటర్స్‌కు వస్తారుగా’.. అని వరుణ్‌ తేజ్‌ వాయిస్‌లో డైలాగ్స్‌తో పాటు ‘ఎఫ్‌ 2’ లో పాపులర్‌ అయిన ‘అంతేగా ..అంతేగా..’ అనే డైలాగ్‌తో ఉన్న కాన్సెప్ట్‌ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ‘‘Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లోనే ఉంటుందిగా…అంతేగా అంతేగా…’’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.