Fire Accident : పెళ్లి మండపంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐనా భోజనాలు ఆపని వైనం

శుభమా అని పెళ్లి జరుగుతుంటే హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు ప్రాణాలకు తెగించి వధువరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తు కూర్చున్నారు.

Fire Accident : పెళ్లి మండపంలో భారీ అగ్ని ప్రమాదం.. ఐనా భోజనాలు ఆపని వైనం

Fire Ravaged Ansari Marriage

Updated On : November 30, 2021 / 8:54 AM IST

fire ravaged Ansari Marriage : శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు హాహా కారాలు చేస్తు వధూవరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తూ కూర్చున్నారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిందిది. తగలబడిపోతే మనకెందుకు.. భోజనానికే వచ్చినట్లుగా తాపీగా ఏమాత్రం కదలకుండా భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.

థానేలో అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం (నవంబర్ సాయంత్రం) ఓ పెళ్లి వేడుక జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల రాత్రి 8 గంటల సమయంలో కల్యాణ మండపంలో భారీగా మంటలు లేచాయి. అతి కష్టం మీద వరుడిని, వధువును కాపాడారు బంధువలు. పెళ్లికి వచ్చినవారిలో చాలామందితో పాటు ఆ చుట్టుపక్కలవారు కూడా వచ్చి మంటలను ఆర్పేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

కానీ.. కొందరు వ్యక్తులు మాత్రం తమకేం పట్టనట్లుగా..తాపీగా కూర్చుని ఏమాత్రం కదలకుండా విందు భోజనం అరగించారు. వెనకాల పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నా.. వారు ఏమాత్రం కదలకుండా.. చలించుకుండా భోజనాలు లాగించేస్తున్నారు. ఈ వింత ఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. మంటలతో జనాలు చచ్చిపోయినా వీళ్లు భోజనాల పూర్తి అయ్యేకే లేచేలా ఉన్నారే..అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.