విద్యార్థుల ఇంటికే సన్నబియ్యం

తెలంగాణ విద్యార్థులపై సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కరోనా కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సర్కార్ బడులు ప్రారంభం అయితే..మధ్యాహ్న భోజనం పథకం వల్ల పేద విద్యార్థులకు ఆకలి తీరేది.
కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడం లేదు. దీంతో మధ్యాహ్న భోజన పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేపడుతున్నాయి. బియ్యాన్ని విద్యార్థుల ఇండ్లకే పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అన్ని రాష్ర్టాలకు కేంద్రం లేఖ రాసింది.
ప్రతి విద్యార్థికి నెలకు మూడు కిలోలకు పైగా సన్న బియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు. లేదంటే నెలకు నాలుగు కిలోల బియ్యాన్ని పంపిణీచేసే అవకాశం ఉందని, పప్పు దినుసులు, నూనె, ఇతర సామగ్రి, కూరగాయల ఖర్చులను అందించాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నందున ఆ బియ్యాన్నే సర్కారు బడుల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయడంపై రాష్ట్ర సర్కారుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యార్థుల ఇండ్లకు సన్నబియ్యం పంపిణీపై మార్గదర్శకాలు రూపొందించనుంది విద్యాశాఖ. జూన్ లేదా జూలై నుంచి దీనిని అమలు చేస్తారని సమాచారం.
Read: రాళ్ల దెబ్బలు, నిలువెల్లా గాయాలు, చుట్టూ శత్రు బలగాలు.. అయినా వెనక్కి తగ్గలేదు..