Genelia: ‘మజిలీ’ రీమేక్‌తో మరాఠీలో ఎంట్రీ ఇస్తున్న బొమ్మరిల్లు బ్యూటీ!
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాతో హీరోయిన్‌గా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ జెనీలియా, ఆ తరువాత టాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించింది. అయితే అమ్మడికి ‘బొమ్మరిల్లు’ మూవీ మాత్రం కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. తాజాగా మరాఠీ భాషలో ఎంట్రీ ఇస్తోంది జెనీలియా.

Genelia In Marathi Remake Of Majili Movie
Genelia: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాతో హీరోయిన్‌గా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ జెనీలియా, ఆ తరువాత టాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించింది. అయితే అమ్మడికి ‘బొమ్మరిల్లు’ మూవీ మాత్రం కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఆ సినిమాలో హాసిని పాత్రలో జెనీలియా పర్ఫార్మెన్స్‌కు అప్పటి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
Genelia : నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను.. కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జెనీలియా
అయితే తాజాగా మరాఠీ భాషలో ఎంట్రీ ఇస్తోంది జెనీలియా. మెయిన్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. రితేశ్ దేశ్‌ముఖ్ హీరోగా నటిస్తూ, తొలిసారి తానే స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ‘వేడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకుని డిసెంబర్ 30న రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ‘మజిలీ’కి ఇది మరాఠీ రీమేక్‌గా రావడం విశేషం. ఈ సినిమాలో చైతూ చేసిన పాత్రలో రితేశ్ నటిస్తుండగా, సమంత పాత్రలో జెనీలియా కనిపిస్తుంది.
Genelia : జెనీలియా రీఎంట్రీ.. భర్త దర్శకత్వంలోనే..
టాలీవుడ్‌లో రియల్ భార్యాభర్తలు రీల్ లైఫ్‌లోనూ అదే పాత్రలు చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పుడు ఇదే తరహాలో బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రితేశ్, జెనీలియాలు తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ ‘వేడ్’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మరి మజిలీ రీమేక్‌కు మరాఠీ ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తారో చూడాలి.