Cobra Inside Scooter : బుసలుకొడుతున్న నాగుపామును చేత్తో పట్టుకున్న వ్యక్తి
నాగుపాము పేరు వినగానే భయంతో వణికిపోతాం. పడగవిప్పి బుసలు కొడితే పరుగులు పెడతాం. . కానీ బుసలుకొడుతున్న నాగుపామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ అవినాష్ యాదవ్ షేర్ చేశారు.
Cobra Inside Scooter : నాగుపాము పేరు వినగానే భయంతో వణికిపోతాం. పడగవిప్పి బుసలు కొడితే పరుగులు పెడతాం. . కానీ బుసలుకొడుతున్న నాగుపామును ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా చేత్తో పట్టుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ అవినాష్ యాదవ్ షేర్ చేశారు.
వీడియోలో ఏముందంటే.. యాక్టీవా ముందు భాగంలో ఓ నాగుపాము ఉంటుంది. పామును బయటకు తీసేందుకు స్నేక్ క్యాచర్ వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. ముందుగా స్క్రూ డ్రైవర్ సాయంతో యాక్టీవా ముందు భాగాన్ని తొలగిస్తాడు. అంతరం పామును బయటకు పంపేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అది ఎంతకీ బయటకు రాకపోగా.. ఆ వ్యక్తిపైకి బుసలు కొడుతూ తిరగబడుతుంది.
Snake Dies After boy Bites: కాటేసిందన్న కోపంతో పామును కొరికి చంపిన బాలుడు .. ఆ తరువాత ఏం జరిగిదంటే..
అయినప్పటికీ ఆ వ్యక్తి పట్టుకోల్పోకుండా కొంత సమయం శ్రమించి ఎంతో చాకచక్యంగా ఆ పామును చేత్తో బయటకు తీస్తాడు. అతను చేసిన ఈ సాహసాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram