Snake Dies After boy Bites: కాటేసిందన్న కోపంతో పామును కొరికి చంపిన బాలుడు .. ఆ తరువాత ఏం జరిగిదంటే..

జష్‌పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి కూతవేటు దూరంలో ఉంటున్న తన అక్కవాళ్లింట్లో ఆడుకుంటున్నాడు. దీపక్ అక్కడి పిల్లలతో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదలో నుంచి పాము వచ్చి కాటేసింది. కోపంతో పామును వెంబడించిన దీపక్.. ఎట్టకేలకు దానిని పట్టుకొని కొరికి చంపాడు.

Snake Dies After boy Bites: కాటేసిందన్న కోపంతో పామును కొరికి చంపిన బాలుడు .. ఆ తరువాత ఏం జరిగిదంటే..

Snake Dies After boy Bites

Snake Dies After boy Bites: పాము మనుషులను కాటేయడం తరచూ వింటుంటాం. కానీ ఓ బాలుడు పామును కాటేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిని పాము కాటేసిందన్న కోపంతో పామును వెంబడించి కొరికి చంపాడు. పాము చనిపోగా.. బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.

Snake In Amit Shah’s Residence : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లోకి ప్రవేశించిన ఐదు అడుగుల పాము

జష్‌పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి కూతవేటు దూరంలో ఉంటున్న తన అక్కవాళ్లింట్లో ఆడుకుంటున్నాడు. దీపక్ అక్కడి పిల్లలతో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదలో నుంచి నాగుపాము బయటకు వచ్చి తన చేతికి తాకింది. దానిని వదిలించుకొనే క్రమంలో దీపక్ కుడిచేతి బొటనవేలును పాము కాటు వేసింది. తనకు నొప్పిగా ఉండటంతో పాము కాటేసిందని గుర్తించాడు. ఒక్కసారిగా కోపంరావటంతో పాము వెనుకాలేవెళ్లి దానిని పట్టుకున్నాడు. అది బుసలు కొడుతున్నా భయపడకుండా పాము తల కింద భాగంలో నోటితో కొరికడంతో పాము మృతిచెందినట్లు దీపక్ తెలిపాడు.]

Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు

ఇక్కడ విచిత్రమేమిటంటే.. దీపక్‌ను కాటేసినప్పటికీ అతని శరీరంపై పాముకాటు ప్రభావం చూపలేదు. తమ్ముడికి పాము కరిచిందన్న విషయాన్ని తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు దీపక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం దీపక్ పూర్తిగా కోలుకున్నాడు. పాము కాటేసినా విషం ప్రభావం చూపదనే మూఢనమ్మకం జష్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చివరన ఉన్న జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ తహసీల్దార్ పరిధి ప్రాంతాలను నాగాలోక్ అని పిలుస్తారు. కింగ్ కోబ్రా వంటి చాలా విషపూరితమైన పాములు ఛత్తీష్‌గఢ్ ఒడిశా రాష్ట్రాన్ని కలిపే రాష్ట్ర హైవే వెంబడి ఉన్న తప్కారా, దాని చుట్టుపక్కల గ్రామాలలో కనిపిస్తాయి.